Site icon NTV Telugu

26న ‘కార్పోరేటర్’ ఆగమనం

షకలక శంకర్ ప్రధానపాత్రధారిగా సమీప మూవీస్ పతాకంపై సంజయ్ పూనూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కార్పోరటర్’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ తో రానుంది. సునీతపాండే, లావణ్య శర్మ, కస్తూరి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో గల్లీ పాలిటిక్స్ ను చూపించబోతున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూనూరి రాములు సమర్పణలో యస్.వి. మాధురి నిర్మిస్తున్నారు. ‘శంభోశంకర, ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన షకలక శంకర్ ‘కార్పోరేటర్’ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాడు. యంగ్ పొలిటియన్స్ ఫర్ న్యూ పాలిటిక్స్ అనే నినాదంతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూద్దాం.

Exit mobile version