NTV Telugu Site icon

Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం

Mla

Mla

Biggboss 7: బిగ్ బాస్ .. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇక నుంచి ఏ ఛానెల్ పెట్టినా బిగ్ బాస్ మాత్రమే వస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై నెల రోజులు దాటింది. ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం అవుతుంది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వంతు. కన్నడ స్టార్ హీరో సుదీప్.. ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక గతరాత్రి కన్నడ బిగ్ బాస్ 10 గ్రాండ్ గా మొదలయ్యింది. ఇక ప్రస్తుతం ఈ షో గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆ హౌస్ లోకి వెళ్లిన ఒక కంటెస్టెంట్. సాధారణంగా బిగ్ బాస్ లోకి సినిమా, సీరియల్, సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని తీసుకొస్తారు. కానీ, మొట్ట మొదటసారి.. ఒక రాజకీయ వేత్త .. అది ఇప్పుడు ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకురావడం సంచలనంగా మారింది.

Chiranjeevi: చిన్నవాడు అయినా మోక్షజ్ఞ కరెక్ట్ చెప్పాడు.. చిరుకు నువ్వెప్పుడు చెప్తావ్ చరణ్

అతను ఎవరో కాదు కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. మాజీ మంత్రి కె.సుధాకర్ ను ఓడించి గెలిచాడు. ఇక అప్పటినుంచి ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు అని అనుకొనేలోపు.. ఇలా రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. డప్పు వాయిద్యాల మధ్య గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ఇలా రియాలిటీ షోలో ఎంటర్ టైన్ చేయడానికి వెళ్ళావా.. ? ఇలా వెళ్లేదానికి ఎమ్మెల్యే గా అవ్వడం ఎందుకు అని ఏకిపారేస్తున్నారు. మరి ప్రదీప్‌ ఈశ్వర్‌ గేమ్ ఆడతాడా.. ? మధ్యలో వచ్చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Show comments