Site icon NTV Telugu

Mohan Babu and Vishnu : రంగంలోకి దిగిన నాయీ బ్రాహ్మణులు … కేసు నమోదు

manchu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు గతంలో తమ హెయిర్ డ్రస్సర్ లక్షల విలువైన పరికరాలను దొంగిలించాడని ఆరోపిస్తూ వార్తల్లో నిలిచారు. నాగశ్రీనుపై పోలీసు కేసు కూడా పెట్టాడు. అయితే నాగశ్రీను మాత్రం తనను తాను నిర్దోషిగా పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. అక్కడితో ఆగకుండా తనపై మంచు మోహన్ బాబు, విష్ణులు అసభ్యంగా ప్రవర్తించారని, తన కులం పేరు చెప్పి దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో నాయీబ్రాహ్మణుల సంస్థ రంగంలోకి దిగింది.

Read Also : Project K : నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ కు ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

కులం ఆధారంగా నాగశ్రీనుపై దుర్భాషలాడినందుకు మంచు కుటుంబంపై సంస్థ నేతలు మండిపడ్డారు. మంచు కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నేతలు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తండ్రీకొడుకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్నప్పటికీ మంచు కుటుంబం కుల దూషణలు చేయడం ఏంటి అంటూ వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా సమాజం కుల, మతాలకు అతీతంగా ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

Exit mobile version