Common Points in Vikram- Jailer- Jawan Movies: ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్, రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్, షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వందల కోట్ల వసూళ్లు రాబట్టి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోమని ఈ ముగ్గురు సీనియర్ హీరోలు నిరూపించుకున్నారు. అయితే ఈ సినిమాలలో కొన్ని కామన్ పాయింట్స్ గుర్తించిన నెటిజన్లు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీస్తున్నారు. ఆ కామన్ పాయింట్స్ ఏమిటి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
- ఈ సినిమాలను తమిళ కుర్రదర్శకులు డైరెక్ట్ చేశారు. విక్రమ్ సినిమాని లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేయగా జైలర్ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్, జవాన్ సినిమాని అట్లీ కుమార్ డైరెక్ట్ చేశారు.
- ఇక ఈ మూడు సినిమాల్లో ముగ్గురు సీనియర్ హీరోలు టైటిల్ రోల్స్ పోషించారు.
- ఈ మూడు సినిమాల్లో హీరోలు గతంలో తనతో కలిసి పనిచేసిన వారి సహాయం తీసుకుని తమకు వచ్చిన సమస్య క్లియర్ చేసుకుంటారు.
- ఈ మూడు సినిమాలలో తండ్రి కొడుకులు మధ్య కనెక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
- ఈ మూడు సినిమాల్లో హీరోలకు మనవడితో కానీ మనవరాలుతో కానీ బాండింగ్ ఉండేలా కొన్ని సీన్లు రాసుకున్నారు. అయితే జవాన్ విషయంలో కొంత తక్కువ.
- ఈ మూడు సినిమాలకి సంగీతం అందించింది యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్.
- ఇక ఈ మూడు సినిమాల్లో మరో కామన్ పాయింట్ ఏమిటంటే హీరోలందరూ గతంలో రక్షణ విభాగానికి చెందిన వ్యక్తులు గానే ఉంటారు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఒక స్పై కాగా జైలర్ సినిమాలో రజనీకాంత్ జైలర్ గా పని చేసి రిటైర్ అవుతాడు. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ జవాన్ గా పని చేసి ఉంటాడు.
- ఈ మూడు సినిమాల్లో మరో కామన్ పాయింట్ ఏమిటంటే మలయాళ నటుడు జాఫర్ సాదిక్. ఆయన ఈ మూడు సినిమాలలోను కనిపిస్తాడు.
- ఈ మూడు సినిమాల్లో ఇతర హీరోల అతిథి పాత్రలు హైలైట్ అయ్యాయి. విక్రమ్ సినిమాలో సూర్య అతిథి పాత్ర చేయగా జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివా రాజకుమార్ అతిధి పాత్రల్లో నటించారు. జవాన్ సినిమా విషయానికి వస్తే సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించాడు.