NTV Telugu Site icon

Hombale Films: అయిదేళ్లలో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం…

Hombale Films

Hombale Films

సినిమా వ్యాపారం అనేది రిస్క్ తో కూడుకున్నది, ఎన్ని సినిమాలు హిట్ అయినా… ఎన్ని కోట్లు రాబట్టినా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు మళ్లీ మొదటికి వచ్చి నిలబడాల్సి ఉంటుంది. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఉన్నది కూడా అమ్ముకోని, తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. పైసా మే పరమాత్మ అనే మాటని తూచా తప్పకుండా పాటించే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ గా నిలబడాలి అంటే చాలా కష్టమైన పని. ఇక్కడ ప్రొడ్యూసర్ గా కొనసాగాలి అంటే డబ్బులు ఉంటే సరిపోదు, ప్యాషన్ ఉండాలి, సరైన కంటెంట్ ని ఎంచుకునే తెలివి ఉండాలి, ఒక సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాని చెయ్యగలను అనే దమ్ము ఉండాలి. ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టే ‘హోంబెల్ ఫిల్మ్స్’ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చెయ్యగల బ్యానర్ అయ్యింది.

2014లో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నందలే’ సినిమాతో మొదలైన ‘హోంబెల్ ఫిల్మ్స్’ సినీ ప్రస్థానం, మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిరాశ చెందలేదు. రెండో సినిమాని ‘యష్’తో చేసి సాలిడ్ హిట్ కొట్టిన హోంబెల్ ఫిల్మ్స్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రీజనల్ సినిమాలు చేసే బ్యానర్… KGF సీరీస్ తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌజ్ అయ్యింది. ఒక హిట్ సినిమా కలెక్షన్స్ అంత కూడా లేని చోట ఎవరూ ఊహించని రేంజులో ఖర్చు పెట్టి KGF సినిమాని ప్రొడ్యూస్ చేసిన మేకర్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. రీసెంట్ గా ‘కాంతారా’ సినిమాతో మరోసారి తమ బ్యానర్ నుంచి సినిమా వస్తే అది ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనే నమ్మకం కలిగించింది. రాబోయే రోజుల్లో హోంబెల్ ఫిల్మ్స్ నుంచి ప్రభాస్ హీరోగా ‘సలార్’ రాబోతోంది. ఈ మూవీతో హోంబెల్ ఫిల్మ్స్ బ్యానర్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడడం గ్యారెంటి. ఇదే జోష్ లో రాబోయే రోజుల్లో హోంబెల్ ఫిల్మ్స్ నుంచి భారి సినిమాలు వస్తాయని చెప్తూ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్, ఒక నోట్ రిలీజ్ చేశాడు. వచ్చే అయిదేళ్లలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో 3000 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తామని హోంబెల్ ఫిల్మ్స్ ని మరింత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తామని చెప్పారు.

Show comments