Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jet Lee OTT Release: టాలీవుడ్ కమెడియన్ సత్య మెయిన్ లీడ్‌లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ “జెట్ లీ” (Jet Lee) డిజిటల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసుకుంది. డైరెక్టర్ రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రేజీ మూవీ, థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్‌స్టార్’ సొంతం చేసుకుంది. మే 25 నుంచి ఈ చిత్రం సదరు ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుందని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఇతర భాషల వెర్షన్లు స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ దాదాపు లేవని తెలుస్తోంది. సత్య కెరీర్లోనే మొదటిసారి పూర్తి స్థాయి లీడ్ రోల్లో నటించిన సినిమా కావడంతో, థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ ప్రియులు ఈ క్రేజీ కామెడీ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించగా, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రి మూవీ మేకర్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది.
Also Read
జెట్ లీ కథ:
ప్రజాపతి (అజయ్) ఒక బిజినెస్ మ్యాన్. ప్రజాపతి పేరుతో బ్యాంకు నిర్వహిస్తూ, ఆ బ్యాంకులో 15 వేల కోట్ల డబ్బులను ఒకచోట ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. ప్రజలందరూ అతని బ్యాంకు నుంచి డబ్బు ఇప్పించాలని ధర్నాలకు దిగుతున్న క్రమంలో, అతను దుబాయ్ పారిపోతుంటాడు. అయితే, ఈ స్కామ్‌లో ఉన్న మిగతా వ్యక్తులు ప్రజాపతిని చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, ఇండియన్ ఏజెంట్స్ అతన్ని పట్టుకుని ఇండియా వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఈ మధ్యలో ఎస్కేప్ అవ్వాలనేది అతని ప్లాన్. మరి ప్రజాపతి ప్లాన్ వర్కవుట్ అయిందా? మధ్యలో ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ వేదవ్యాస్( సత్య ) పాత్ర ఏమిటి? మరోపక్క సినీ సుడోకు ఆడుకునే వెన్నెల కిషోర్ పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..