Site icon NTV Telugu

Comedian Raghu : కమెడియన్ రఘు కూతుర్లను చూశారా.. ఎంత అందంగా ఉన్నారో?

Raghubabu Daughters

Raghubabu Daughters

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడీయన్లకు కొదవ లేదు.. ఎంతో మంది ఉన్నారు.. వారంతా తమ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఇప్పుడు కొందరు డైరెక్టర్స్ గా కూడా మారారు.. అందులో అందరికి బాగా గుర్తుకు వచ్చే నటుడు.. రఘు.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్‌ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..

అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్‌ వి.వి వినాయక్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్‌ చిత్రాల్లో అవకాశం లభించింది. అదుర్స్‌లో మంచి పాత్ర లభించడంతో రఘు పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది. అలాగే జబర్దస్త్‌ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చింది.. ఈ నటుడు ఇప్పటివరకు దాదాపు 200 లకు పైగా సినిమాల్లో నటించాడు.. ఒకవైపు వరుస సినిమాలను చేస్తున్నా కూడా రఘుకి సరైన గుర్తింపు రాలేదు. ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రఘు లిక్కర్‌ దందాలోకి దిగాడు. రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్‌ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్‌ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు. రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు..

అతనికి స్టాక్‌ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు.’షేర్‌ మార్కెట్‌లో భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. టెన్షన్‌తో ఇంట్లో ఉన్నకంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ని పగులగొట్టాను’అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.. తాజాగా రఘు కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రఘుకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి..

Exit mobile version