NTV Telugu Site icon

30 Years Prudhvi: పావలా కాదు యాంకర్ శ్యామల… చెప్పులు, చీపుళ్ళతో కొడతామంటూన్నారు!

Pruthvi Raj Counter To Shyamala

Pruthvi Raj Counter To Shyamala

Comedian Prudhvi Counter to Anchor Shyamala: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీల ప్రచారం ఊపందుకుంటుంది. అయితే పార్టీల తరపున కొంతమంది సినీ నటీనటులు కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరఫున కొంతమంది ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కథ వివాదాస్పదం అయింది. అందులో చంద్రబాబుని గుంట నక్కతో పోల్చింది అంటూ ఆమె మీద తెలుగుదేశం శ్రేణులతో పాటు జనసేన సైనికులు కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న కమెడియన్ పృథ్వీరాజ్ యాంకర్ శ్యామలకు కౌంటర్ ఇచ్చారు. నేను చేసిన లౌక్యం సినిమాలో ఆవిడ ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. ఎవరు ఆవిడ అని ప్రశ్నిస్తే పక్కనున్న వ్యక్తి పావలా శ్యామల అని కామెంట్ చేశాడు.

Anshu: మన్మథుడు బ్యూటీ రీ ఎంట్రీ ఫిక్స్.. భలే సినిమా పట్టేసిందే?

కాదు కాదు పావలా కాదు యాంకర్ శ్యామల అంటూ కమెడియన్ పృథ్వీ చెప్పుకొచ్చారు. ఆవిడ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని గుంట నక్క అని ఎలా మాట్లాడిందో గతంలో నగరి రోజమ్మ కూడా ఒక దరిద్రుడు జైలుకెళితే మరో దరిద్రుడు జైలుకెళ్లి పరామర్శించాడు అంటూ మాట్లాడింది. వీళ్ళకి లోపల ఉద్దేశాలు ఒకటే కానీ మాటలు మాత్రమే మార్చి మాట్లాడుతూ ఉంటారని పృథ్వీరాజ్ విమర్శించారు. మేము జనసేన తరఫున వీర మహిళలతో కలిసి విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో పర్యటించాం. రెల్లి వీధి లాంటి ఎన్నో వీధుల్లో పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉంది. అక్కడ దుర్గంధ భరితంగా ఉంటే ఈవిడ మాత్రం వచ్చి విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది అంటూ మాట్లాడుతోంది. ఆమెకు బహుశా విశాఖపట్నం అందంగా ఉంది అని చెప్పడానికి డబ్బులు ఇచ్చారేమో అంటూ పృథ్వీరాజ్ విమర్శించారు. ఇక ఆమె అలా మాట్లాడుతుంటే కొంతమంది మహిళలు మాకు ఫోన్లు చేస్తున్నారు. చెప్పులు, చీపుళ్ళతో కొడతామంటూన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.