బాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ మూవీగా థియేటర్లలోకి వచ్చింది ‘కాక్‌టెయిల్ 2’. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ జంటగా హోమీ అదాజానియా దర్శకత్వంలో వచ్చిన కాక్‌టెయిల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే మంచి హోల్డ్ సాధించి ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని గమనిస్తే.. మొదటి రోజు నుంచే సాలిడ్ కలెక్షన్లు నమోదయ్యాయి. మొదటి రోజు రూ. 115.39 కోట్లు, రెండవ రోజు రూ. 19.25 కోట్లు, మూడవ రోజు ఆదివారం రూ. 20.22 కోట్లు రాబట్టి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. మొత్తంగా చూసుకుంటే మూడు రోజుల మొదటి వీకెండ్‌లో ‘కాక్‌టెయిల్ 2’ ఆల్ ఇండియా ట్రాక్డ్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 54.86 కోట్లకు అటు ఇటుగా నమోదు చేసింది. సీక్వెల్ హైప్ కు తోడు మౌత్ టాక్ బాగుండటంతో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఇదొక అద్భుతమైన వీకెండ్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అయితే పోటీలో మరే ఇతర సినిమాలు లేకపోవడం ఈ సినిమా రన్ కు కాస్త కలిసొచ్చే అంశం. మరి వీక్‌డేస్‌లో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రూ. 150కోట్లతో తెరకెక్కిన కాక్‌టెయిల్ 2 ఫైనల్ రన్ లో ఎంత సాధిస్తుందో చూడాలి.

