Site icon NTV Telugu

CM Pellam: “సీఎం పెళ్లాం”తో మామూలుగా ఉండదు మరి.. టీజర్ లాంఛ్!!

Cm Pellam Teaser

Cm Pellam Teaser

CM Pellam Movie Teaser Launched: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను గడ్డం వెంకట రమణారెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ చేశారు. దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రి కావడం చూశాం, మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం అన్నారు.

Simbaa: ఓటీటీలో రచ్చ రేపుతున్న ‘సింబా’

నటి ఇంద్రజ మాట్లాడుతూ సీఎం పెళ్లాం సినిమాలో సీఎం భార్య పాత్రలో నటించాను. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాడు. అక్కడ బాగా స్థిరపడ్డాడు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉండనీయదు కదా మళ్లీ వచ్చాడు. సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు, ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్, ఘర్షణ శ్రీనివాస్, మురళీధర్, ప్రీతి నిగమ్, రూపా లక్ష్మి, స్వాతి, సురేష్ కొండేటి తదితరులుఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.

Exit mobile version