Site icon NTV Telugu

ChaySam: చైతూ-సామ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అదంతా పచ్చి అబద్ధం

Samantha Chaitu News

Samantha Chaitu News

Clarity On Naga Chaitanya Samantha Rumours: మయోసైటస్ వ్యాధితో బాధపడుతున్న సమంతను నాగ చైతన్య రీసెంట్‌గా కలిశాడని ఓ ప్రచారం తెగ చక్కర్లు కొట్టింది. ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి మరి అతడు ధైర్యం చెప్పాడని, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి. విడాకులు తీసుకొని విడిపోయినా, స్నేహితుడిగా ఎప్పుడూ తోడుగా ఉంటాననే భరోసాని సైతం కల్పించినట్టు రూమర్స్ గాసిప్పులు గుప్పుమన్నాయి.

అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. సామ్‌ని చైతూని కలవలేదని, కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదని వెలుగులోకి వచ్చింది. వాళ్లిద్దరు కలిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిప్రాయాల్ని వెల్లడించిన తరుణంలో.. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఎవరో ఈ ప్రచారానికి తెరలేపినట్టు స్పష్టమైంది. దీంతో.. విడాకులు తీసుకొని ఇన్నాళ్లయినా, వీరి మధ్య విభేదాలు మాత్రం తొలగిపోలేదని మరోసారి క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని అఖిల్ కూడా సమంత పూర్తిగా కోలుకోవాలని ట్విటర్ మాధ్యమంగా స్పందించారే తప్ప.. చైతూ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.

కాగా.. టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్‌గా పేరొందిన చైతూ, సామ్ 2017 అక్టోబర్ 16వ తేదీన పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాలకు పైనే వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో దూరం అయ్యారు. చివరికి 2021 అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోయినట్లుగా వాళ్లిద్దరు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశారు. ఈ వార్త ఇరువురి అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. వీళ్లు మళ్లీ కలిస్తే బాగుంటుందని.. ఇప్పటికీ ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు.

Exit mobile version