Nag Ashwin Comments at Cinematic Expo Show: ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలవగా ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇప్పుడు రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తోందని, నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించామని, నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయని, ఎంతో మారిందని అన్నారు.
Bhanu Sri Mehra: బిగ్ బాస్ ఒక చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుందని సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోందని అన్నారు. నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తాను చాటుతున్నారు, మేం ఆస్కార్ వరకు వెళ్లామని అన్నారు. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోందని అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నా, వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగాను. హాలీవుడ్ లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నామని ఆయన అన్నారు. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారని, ప్రాజెక్ట్ కేని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించా కానీ వర్కౌట్ కాలేదు. అయితే పెద్ద మొత్తంలో వర్క్స్ ఇక్కడే చేయిస్తున్నానని అనాన్రు. ఇక నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’’ అని అన్నారు.