నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ZEE5 మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన లో రిలీజ్ కానున్న వికటకవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
* వికటకవి’ ప్రయాణం ఎలా మొదలైంది?
– ప్రశాంత్ వర్మగారితో అ!, కల్కి సినిమాలకు వర్క్ చేసిన రైటర్ తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథ. నేను ఓసారి కలుసుకున్నప్పుడు వికటకవి సిరీస్ గురించి చెప్పి.. నువ్వు డైరెక్ట్ చేస్తావా! అని అడిగారు. నేను కథ విన్నాను. నేను అంగీకరించాను. అక్కడి నుంచి వికటకవితో నా ప్రయాణం ప్రారంభమైంది.
* పీరియాడిక్ జోనర్‌లో సిరీస్‌ను చేయటం ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది?
– వికటకవి తరహా పీరియాడిక్ సిరీస్ చేయటం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. 1940, 1970 కాలాలకు సంబంధించిన సెటప్స్, బట్టలు, అప్పటి ప్రజలు మాట్లాడే భాష, లుక్స్, లైటింగ్, వర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది
* అమరగిరి ప్రాంతంలోని ఏ రహస్యాన్ని మీరు చూపించబోతున్నారు?
– 1940ల్లో అమరగిరి ప్రాంతంలో ఓ ఘటన జరిగి ఉంటుంది. 1970లో అది మళ్లీ పునరావృత్తమయ్యేలా ఉంటుంది. అలా జరగటాన్ని అక్కడి ప్రజలు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు సమస్యా? అని హీరో అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అదేంటనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.
* నరేష్ అగస్త్యను హీరోగా ఎంచుకోవటానికి రీజనేంటి?
రాజేంద్రప్రసాద్‌గారితో నటించిన సేనాపతి, మత్తువదలరా చూశాను. తన యాక్టింగ్ నన్నెంతో ఆకట్టుకుంది. దాంతో నేను నరేష్ పేరుని సజెస్ట్ చేశాను. ఆ సమయంలో జీ5వాళ్లు నరేష్‌తో పరువు సిరీస్‌ను చేస్తున్నారు. అప్పుడు ఫిక్స్ చేశాను
* వికటకవి సీజన్ 2 ఉంటుందా?
– ఉంటుందండి.. రైటర్ తేజ ఇప్పటికే దాని మీద వర్క్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఇంకా పెద్ద స్కేల్‌లో వికటకవి 2 ఉండబోతుంది.
* నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి?
– ఓ న్యూ ఏజ్ ఐడియాతో సైఫై హారర్ కథను తయారు చేసే పనిలో ఉన్నాను. ఓ యాక్షన్ థ్రిల్లర్ ఫాంటసీ మీద వర్క్ చేస్తున్నాను.