దీపావళి పండుగ వేళ సినీ ప్రియులకు ZEE5 అదిరిపోయే శుభవార్త అందించింది. పండుగ సందడిని రెట్టింపు చేసేందుకు, “భారత్ బింగే ఫెస్టివల్” పేరుతో అక్టోబర్ 13 నుంచి 20 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించడంతో పాటు, ఎన్నో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తోంది. ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా, ZEE5 తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చిన కంటెంట్‌ను బట్టి ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ దీపావళికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ZEE5 వివిధ భాషల్లో కొత్త కంటెంట్‌ను సిద్ధం చేసింది.
తెలుగు: కిష్కింధపురి, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయమ్మురా.
హిందీ: భగవత్ చాప్టర్ వన్ – రాక్షస్, సాలీ మోహబ్బత్, హనీమూన్ సే హత్య.
తమిళం: వేదువన్, హౌస్ మేట్స్, మామన్.
మలయాళం: సుమతి వలువు, అభంతర కుట్టవాలి, కమ్మట్టం.
కన్నడ: ఏలుమలే, అయ్యన మనే, మరిగల్లు.
ఇతర భాషలు: మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా పలు కొత్త సిరీస్‌లు మరియు కథలు రానున్నాయి.
