NTV Telugu Site icon

Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!

Demonte Colony

Demonte Colony

ZEE5 announces World Digital Premiere of Demonte Colony 2: తాజాగా ర‌ఘుతాత‌, నున‌క్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భ‌యంతో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. వెన్నులో వ‌ణుకు పుట్టించేలా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించగా అరుల్‌నిధి, ప్రియా భ‌వానీ శంక‌ర్ అద్భుత‌మైన న‌ట‌న‌తో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను కూర్చోపెట్టారు. త‌మిళ్ సినీ హిస్ట‌రీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. శాప‌భ‌రిత‌మైన ఓ బంగారు గొలుసును దొంగ‌లించ‌టానికి కొంత‌మంది స్నేహితులు ప్ర‌య‌త్నిస్తారు. దాంతో నిద్రావ‌స్థ‌లోని భ‌యంక‌ర‌మైన ఆత్మ మేల్కొంటుంది. ఆ దుష్ట ఆత్మ ప్ర‌తీకార చ‌ర్య నుంచి త‌మ స్నేహితుల‌ను కాపాడుకోవ‌టానికి కొంత‌మంది ధైర్య‌వంతులైన స్నేహితులు ఏకం అవుతారు. ఘ‌న విజ‌యం సాధించిన‌ ‘డీమాంటే కాలనీ’కి కొన‌సాగింపుగా రూపొందిన ‘డీమాంటే కాలనీ 2’.. ముందు చిత్రాన్ని మించేలా ఆస‌క్తిక‌ర‌మైన హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాల‌తో తెర‌కెక్కింది. అంతే కాకుండా తొలి భాగం కంటే కూడా భ‌యానక‌మైన స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ‘డీమాంటే కాలనీ 2’ తెర‌కెక్కింది.

Simbaa: ఓటీటీలో రచ్చ రేపుతున్న ‘సింబా’

ఇక ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు మాట్లాడుతూ ‘‘థియేట‌ర్స్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ‘డీమాంటే కాలనీ 2’.. ఇప్పుడు జీ 5 ద్వారా మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రావ‌టం ఆనందాన్నిచ్చే విష‌యం. ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన ఈ అద్భుత‌మైన స్పంద‌న గొప్ప‌గా అనిపించింది. ఇప్పుడు జీ5 వంటి మాధ్య‌మం ద్వారా ఈ చిత్రం అల‌రించ‌నుంది. మ‌రింత ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా రీచ్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చన్నారు.

Show comments