హార్రర్ థ్రిల్లర్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జోంబీ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’. ఈ చిత్రం మే 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. డేవ్ బటిస్టా, ఎల్లా పర్నెల్, ఒమారి హార్డ్‌విక్, అనా డి లా రెగ్యురా, థియో రోస్సీ, హిరోయుకి సనాడా నటించిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హాలీవుడ్ అరంగేట్రం చేసింది. ట్రైలర్ లో హ్యూమా ఖురేషి కూడా మెరిసింది. ఈ జొంబి థ్రిల్లర్ ను జస్టిస్ లీగ్ సిరీస్ సినిమాల దర్శకుడు జాక్ స్నైడర్ తెరకెక్కించారు. ఈ ట్రైలర్ లో హై యాక్షన్ సన్నివేశాలు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సన్నివేశాలను మనం చూడవచ్చు. కేసినో బాస్ బ్లీ తనకా (హిరోయుకి) ఇంతకుముందు జొంబి వార్ లో హీరోగా నిలిచినా స్కాట్ వార్డ్ (డేవ్ బౌటిస్టా)ను ఒక ప్రొపోజల్ తో కలుసుకోవడంతో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. స్ట్రిప్ క్లబ్‌లో పడి ఉన్న 200 మిలియన్లను తిరిగి తీసుకురావాలని స్కాట్ ను అడుగుతాడు బ్లీ. కానీ అది జోంబీల క్వారంటైన్ జోన్. ఈ పనికి స్కాట్ కు 50 మిలియన్ల ఆఫర్ చేస్తాడు బ్లీ. ఈ ఆఫర్ ను ఒప్పుకున్న స్కాట్ తన టీంతో 200 మిలియన్ల డబ్బును తేవడానికి జోంబీ ల్యాండ్ కు వెళతాడు. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? 200 మిలియన్లను తీసుకురాగలిగారా ? అనేది తెరపై చూడాల్సిందే. మీరు కూడా ఈ యాక్షన్ ట్రైలర్ ను వీక్షించండి.
జోంబీ థ్రిల్లర్ ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ ట్రైలర్… మెరిసిన బాలీవుడ్ బ్యూటీ…!
