జోంబీ థ్రిల్లర్ ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ ట్రైలర్… మెరిసిన బాలీవుడ్ బ్యూటీ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్రర్ థ్రిల్లర్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జోంబీ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’. ఈ చిత్రం మే 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. డేవ్ బటిస్టా, ఎల్లా పర్నెల్, ఒమారి హార్డ్‌విక్, అనా డి లా రెగ్యురా, థియో రోస్సీ, హిరోయుకి సనాడా నటించిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హాలీవుడ్ అరంగేట్రం చేసింది. ట్రైలర్ లో హ్యూమా ఖురేషి కూడా మెరిసింది. ఈ జొంబి థ్రిల్లర్ ను జస్టిస్ లీగ్ సిరీస్ సినిమాల దర్శకుడు జాక్ స్నైడర్ తెరకెక్కించారు. ఈ ట్రైలర్ లో హై యాక్షన్ సన్నివేశాలు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సన్నివేశాలను మనం చూడవచ్చు. కేసినో బాస్ బ్లీ తనకా (హిరోయుకి) ఇంతకుముందు జొంబి వార్ లో హీరోగా నిలిచినా స్కాట్ వార్డ్ (డేవ్ బౌటిస్టా)ను ఒక ప్రొపోజల్ తో కలుసుకోవడంతో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. స్ట్రిప్ క్లబ్‌లో పడి ఉన్న 200 మిలియన్లను తిరిగి తీసుకురావాలని స్కాట్ ను అడుగుతాడు బ్లీ. కానీ అది జోంబీల క్వారంటైన్ జోన్. ఈ పనికి స్కాట్ కు 50 మిలియన్ల ఆఫర్ చేస్తాడు బ్లీ. ఈ ఆఫర్ ను ఒప్పుకున్న స్కాట్ తన టీంతో 200 మిలియన్ల డబ్బును తేవడానికి జోంబీ ల్యాండ్ కు వెళతాడు. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? 200 మిలియన్లను తీసుకురాగలిగారా ? అనేది తెరపై చూడాల్సిందే. మీరు కూడా ఈ యాక్షన్ ట్రైలర్ ను వీక్షించండి.
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..