YouTuber Praneeth Hanumanthu Sent Custody in Chanchalguda jail: నటుడిగా మారిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తండ్రి కూతురు బంధానికి మచ్చ తెచ్చే విధంగా అతను ఒక వీడియో మీద తన బ్యాచ్ తో కలిసి చేసిన రోస్టింగ్ పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. ఈ విషయం మీద సాయి ధరంతేజ్ సహా పలువురు హీరోలు స్పందించగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా డిజిపి డిప్యూటీ సీఎం వంటి వాళ్ళు అతని మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్లిన హైదరాబాద్ సైబర్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతడిని అరెస్టు చేసి పీటీ వారంటీ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు.
Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
ఈరోజు నాంపల్లి కోర్టులో అతని ప్రొడ్యూస్ చేయగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో అతన్ని చంచల్గుడా జైలుకు తరలించారు. ప్రణీత్ హనుమంతుతో పాటు మరో ముగ్గురు మీద కేసు నమోదు చేసిన పోలీసులు A2గా డల్లాస్ నాగేశ్వర్ రావు A3గా బుర్రా యువరాజ్ A4గా సాయి ఆది నారాయణలను కూడా అరెస్ట్ చేశారు. ఇక దీనిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రణిత్ మీద 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 BNS సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయగా పోక్సో కేసు కూడా నమోదు చేశారు.