Site icon NTV Telugu

Karthikeya : యంగ్ హీరో కార్తికేయ.. ‘అబద్ధమేవ జయతే’

Karthikeya

Karthikeya

అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఓ సామెత ఉంటుంది. మరి అది నిజమేనా? అన్న కాన్సెప్ట్‌తో ఓ కామెడీ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తికేయ రిలీజ్ చేసాడు. టైటిల్ చాలా ఉందని ఉందని అభినందిస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విలేజ్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది.  పవన్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. వికాస్ చిక్‌బల్లాపూర్ కెమెరామెన్‌గా, షాడో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డితో పాటు మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం, బలగం సుధాకర్, రాజశేఖర్ అనింగి, శరత్ బగిరాల, సతీష్ సారిపల్లి, సుజాత, మాయానంద్ ఠాకూర్, అర్రున్ సవ్వనా, నటుడు ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version