NTV Telugu Site icon

Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?

Untitled Design (3)

Untitled Design (3)

రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంపై రవితేజ  అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుడల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాల మధ్య పోటీగా విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. కాగా ఈ చిత్రంలో ఓ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అతడెవరో కాదు DJ టిల్లు, టిల్లు -2 వంటి సూపర్ హిట్లు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ టాక్. ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు హారిష్ శంకర్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ‘తెలుసు కదా’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ శ్రీమతి నీరజ కోన ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టనున్నారు. మాస్ మహారాజ, టిల్లు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Also Read:Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ మెచ్చిన చిత్రం..ఆ సినిమాలో ఏముంది..?

Show comments