టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత కూడా మలయాళం నుండి వచ్చిన బ్యూటీనే. మాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతుంటే కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు.
Also Read : Sandile Wood : మరో డిఫ్రెంట్ సినిమాతో ఆడియెన్స్ ను ఆశ్యర్యపరచబోతున్న వర్శటైల్ యాక్టర్
అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన ఈ భామ ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. ప్రజెంట్ కళ్యాణి తమిళ, మలయాల చిత్రాలపై చూపించే శ్రద్ధ తెలుగు సినిమాలపై చూపించట్లేదు. అవకాశాలు వచ్చిన కూడా చేయడం లేదని టాక్ కూడా వినిపించింది. ఈ వ్యాఖ్యలకు తాజాగా కళ్యాణి ప్రియదర్శిని సమాధానం ఇచ్చింది. కొత్త లోక సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ “నాకు ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువారే. అది నేను ఎప్పటికీ మరచిపోను. ఇన్నిరోజులు తరువాత మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. సరైన కథలు వస్తే నాకు తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది. కొత్తలోక సినిమాని తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే మాకు బలం. మీ మద్దతుతో ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని వస్తాయి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్యూ. కథ నచ్చితే కన్ఫార్మ్ గా సినిమా చేస్తాను’ అని అన్నారు.
