NTV Telugu Site icon

ఆకట్టుకుంటున్న “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ప్రోమో

You Avakay Me Ice Cream Promo

షీతల్ గౌతమన్, ఉద్దవ్ రఘునందన్, నాగ బాబు కొణిదెల, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రోమ్ కామ్ తెలుగు వెబ్ సిరీస్ “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం”. విభిన్నమైన రుచులు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ఈ వెరైటీ కాంబినేషన్ లాగే తాజాగా విడుదలైన ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రోమో ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. “ఇన్ఫినిటీ వంటింటికి స్వాగతం… ఈరోజు వంటకు కావాల్సిన పదార్థాలు… ముందుగా ఐస్ క్రీంలా కూల్ కూల్ గా ఉండే ఒక పోరడు… అట్లనే ఆవకాయ లాగా చిర్రుబుర్రులాగే ఒక పిల్ల…” అంటూ ప్రియదర్శి హీరోహీరోయిన్లను పరిచయం చేశాడు. అయితే ఈ ప్రోమో చూస్తుంటే ప్రేక్షకులకు మాత్రం విజయ్ దేవరకొండ నటించిన “పెళ్లి చూపులు” చిత్రం గుర్తొస్తోంది. మీరు కూడా “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ప్రోమోపై ఓ లుక్కేయండి.