NTV Telugu Site icon

Yogi Babu: అందం కాదు బాసూ టాలెంట్ ఉంటే హాలీవుడ్ అయినా సలాం కొట్టాల్సిందే!

టాలెంట్ ఉంటే హ్యాండ్సమ్, క్రేజీ బాయ్ లాంటి ట్యాగ్స్ అవసరం లేదని ఫ్రూవ్ చేసిన యాక్టర్ యోగి బాబు. ఎగతాళి చేసిన తన రూపాన్నే ఆయుధంగా మలుచుకుని యోధుడిగా మారి సినిమా అనే యుద్దంలో విన్ అయ్యాడు. అవమానాలను స్టెప్పింగ్ సోన్స్‌గా వేసుకుని స్టార్ కమెడియన్ కమ్ హీరోగా ఎదిగాడు. ఈ అన్ ప్రిడక్టబుల్ జర్నీలో మరో హయ్యర్ స్టెప్ వేస్తున్నాడు.

తెరపై కనిపించగానే మొహంపై స్మైల్ వచ్చిందంటే.. అది కచ్చితంగా బ్రహ్మానందమే. ఆ ప్లేసును రీసెంట్లీ ఆక్యుపై చేశాడు యోగి బాబు. ఆయన టైం, టైమింగ్ సింప్లీ సూపర్బ్. ఫేస్, ఫిజిక్ ఎలా ఉన్నా.. యాక్టింగ్‌తోనే కడుపుబ్బా నవ్వించడమే ఆయన టార్గెట్. ఆవారాతో స్టార్టైన కెరీర్.. కొలమావు కోకిలతో పీక్స్‪కు చేరింది. కమెడియన్ నుండి నౌ హీరోగానూ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. కేవలం తమిళ ఆడియన్స్‌కు మాత్రమే కాదు… డబ్బింగ్ సినిమాలతో ఓవరాల్ అన్ని ఇండస్ట్రీల్లో పాపులారిటీ దక్కించుకున్న యోగి బాబు.. మరో మైలు రాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.

చెన్నై ఎక్స్ ప్రెస్‌తో బాలీవుడ్, రీసెంట్ హిట్ గురువాయుర్ అంబలనడయిల్‌తో మాలీవుడ్ లో సక్సెసైన ఈ స్టార్ కమెడియన్.. త్వరలో టాలీవుడ్‌లో తెరగేట్రం చేస్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్‌లో కితకితలు పెట్టేందుకు ఫిక్స్ అయ్యాడు. ఇవే కాదు.. ఓ రేర్ ఫీట్ టచ్ చేశాడు. యోగి బాబు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రాప్ సిటీ హాలీవుడ్ మూవీలో ర్యాపర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్లీ ట్రాప్ సిటీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. స్టెప్స్ వేస్తూ న్యూ లుక్స్‌లో షాకిచ్చాడు యోగి.

టెల్ కే గణేశన్ డైరెక్షన్‌లో.. కైబా ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో జీవి ప్రకాష్..నెపోలియన్ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఛాలెంజింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓ యువ ఆర్టిస్ట్ చేసే పోరాటం ఆధారంగా ట్రాప్ సిటీ తెరకెక్కుతోంది. తిరుచ్చిలో పుట్టి పెరిగిన టెల్ కే గణేశన్.. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లి అక్కడే ఓ వ్యాపార సంస్థను స్థాపించి.. నెక్ట్స్ హాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ టాలెంట్ యాక్టర్లను యస్టాబ్లీష్ చేసేందుకు గణేశన్ కృషి చేస్తున్నాడు. గతంలో ఓమూవీలో నెపోలియన్‌ను పరిచయం చేసిన వెలుగులోకి తెచ్చేందుకు గణేశన్ కృషి చేస్తున్నాడు ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టార్ కమెడియన్ యోగి బాబును హాలీవుడ్ లోకి తీసుకెళుతున్నాడు. ఇండియన్ సినిమాలో నవ్వులు పువ్వులు పూయించిన యోగి బాబు.. హాలీవుడ్‌లో కూడా ఫ్రూవ్ చేసుకోవాలని ఆశిద్దాం.

Show comments