Site icon NTV Telugu

Yoga Anthem: ‘యోగా ఆంథెమ్’ సాంగ్ రిలీజ్

Yoga Anthem

Yoga Anthem

మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – “మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా. ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు వాడాను. సంస్కృతాన్ని దైవ భాష అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు ధన్యవాదాలు. యోగాకు ప్రచారం కల్పిస్తూ, దానికి ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులందరికీ ధన్యవాదాలు.” అన్నారు.

Exit mobile version