Site icon NTV Telugu

జైల్లో యాక్టర్ కరణ్ మెహ్రా… తనకు మానసిక రుగ్మత ఉందని అంగీకరించిన భార్య!

yeh Rishta Kya Kehlata Hai Actor Karan Mehra Arrest

‘యే రిష్తా క్యా కెహ్లాతాహై’ … హిందీ ప్రేక్షకులకి బాగా తెలిసిన హిట్ సీరియల్ ఇది. అయితే, అందులో ప్రధాన పాత్ర పోషిస్తోన్న కరణ్ మెహ్రా ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభంలో చిక్కుకున్నాడు. అతడి భార్య నిషా రావల్ గృహ హింస ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. దాంతో పోలీసులు నటుడు కరణ్ మెహ్రాని అరెస్ట్ చేశారు. అయితే, నిషా చెబుతోన్నట్టు తాను ఆమెని గోడకేసి కొట్టి గాయపరచలేదని కరణ్ అంటున్నాడు. తనే పలు మార్లు గోడకు తలను బాదుకుందని ఆయన వాదన. కానీ, భార్య నిషా వర్షన్ మరోలా ఉంది…

బుల్లితెర పై మంచి పేరు సంపాదించిన కరణ్ మెహ్రా భార్య ఆరోపణలపై స్పందిస్తూ పలు మార్లు ఆమెకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందంటూ చెబుతున్నాడు. దీనిపై ప్రతిస్పందించిన నిషా రావల్ ‘బైపోలార్ డిజార్డర్’ నిజమేనని అంగీకరించింది. అయితే, అది తనకు 2014లో ఉండేదని చెప్పింది. అప్పట్లో ప్రెగ్నెంట్ గా ఉన్న తనకు అబార్షన్ జరగటంతో మానసికంగా క్రుంగిపోయానని, అందుకే ఆ తీవ్రమైన బాధ కారణంగా బైపోలార్ డిజార్డర్ వచ్చిందని ఆమె వివరించింది. బైపోలార్ డిజార్డర్ అంటే మానసిక ఒత్తిడి కారణంగా ఏర్పడే మూడ్ డిజార్డర్. అది ఉన్న వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం.

తనకు మానసిక సమస్యలు ఉండేవని అంగీకరిస్తూనే, కరణ్ మెహ్రా భార్య మరిన్ని ఆరోపణలు చేసింది. అసలు తన భర్త ఎప్పుడూ తన పట్ల మంచిగా ప్రవర్తించలేదని వాపోయింది. తాను మిస్ క్యారేజ్ వల్ల తీవ్రమైన డిప్రెషన్ లో ఉంటే కరణ్ కొట్టేవాడనీ, థెరపిస్టు వద్దకి ట్రీట్మెంట్ కి కూడా వెళ్లనిచ్చేవాడు కాదనీ, దారుణంగా బెదిరించే వాడని నిషా రావల్ చెప్పింది. ఇక మే 31వ తేదీన తమ మధ్య జరిగిన గొడవ గురించి చెబుతూ, ఆమె, తనని కరణ్ గోడకు అదిమి గాయపరిచాడని, గొంతు నులిమేశాడని షాకింగ్ వివరాలు బయటపెట్టింది.
కరణ్ మెహ్రా, నిషా రావల్ వివాదంలో ఎవరు చెబుతోన్నది కరెక్టో… కాలము, కోర్టులే తేల్చాలి!

Exit mobile version