పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహారించారు. అన్ని హంగులు పూర్తీ చేసుకుని ఈ నెల 24న విడుదల కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ నేడు హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడూతూ ‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి రత్నం లాంటి వారికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదు అని నేను వచ్చాను. దర్శకులు జ్యోతి కృష్ణ, డీఓపీ మనోజ్ పరమహంస నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు. అప్పడు ఈ సినిమాను ఓ అనాధలా వదిలేశాము అనిపించింది. అందుకే అనాధ లా వదల్లేదు అనడానికే నేను వచ్చాను. నా సినిమాను నేను ఎలా వదిలేస్తాను. నేనుకోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని. అలాంటిది తెలుగు సినిమా కోసం రాకుండా ఎందుకు ఉంటాను. డిప్యూటీ సీఎం కాగానే పొగరు వచ్చేసింది అనుకుంటారని అందరి కంటే ముందే వచ్చి కార్ లో వెయిట్ చేశా. సినిమా కోసం నేను తప్పకుండా నా వంతు భాద్యతగా ఉంటా. మీ అందరికి తెలుసు గతంలో నా సినిమాలను అప్పటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులు పెట్టిందో. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే హృదయ కవాటాలు తెరిచిమరి స్వాగతం పలికాం. అలాంటిది నా సినిమాను నేను ఎందుకు వదిలేస్తాను. మేకప్ మ్యాన్ నుండి ఈ రోజు ఇంతటి నిర్మాతగా ఎదిగిన రత్నం నాతో సినిమా చేస్తే నేను ఎందుకు రాకుండా ఉంటాను ‘ అని అన్నారు.
Also Read : Pawan Kalyan : ఇతర హీరోలతో పోల్చితే నాకు అంత బిజినెస్ ఉండకపోవచ్చు
