Site icon NTV Telugu

Yash : యష్ ‘టాక్సిక్’ సినిమా పై క్రేజీ బజ్..

Yash’s Toxic

Yash’s Toxic

‘కేజీయఫ్’ చిత్రాల ఘన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెరీర్ కామ..పుల్‌స్టప్ లేకుండా ధూసుకుపొతుంది. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు ఆసక్తికర ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు యష్. ఇటీవల ఆయన పాలు పంచుకుంటున్న బాలీవుడ్ ‘రామాయణ’ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఓ క్రేజీ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది.

తాజా బజ్ ప్రకారం, ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్‌ను ఎంచుకున్నారని టాక్. అది కూడా పాటల కోసం కాదట, సినిమాలో ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి అనిరుద్‌ను తీసుకున్నారని సమాచారం. ఇది నిజమైతే, టాక్సిక్‌కి భారీ ప్లస్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని మళయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఇక అనిరుద్ మ్యూజిక్ కలిస్తే సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది కానీ, యష్ – అనిరుద్ కాంబినేషన్ అన్న మాటే ఫ్యాన్స్‌ను ఇప్పుడే ఉత్సాహపరుస్తోంది. మరి ఇది రూమర్‌గానే మిగిలిపోతుందా, లేక నిజంగానే రెవల్యూషనరీ కాంబో అవుతుందా అనేది తేలాల్సి ఉంది.

Exit mobile version