రాకింగ్ స్టార్ యష్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. కాగా ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు. గోవా మాదక ద్రవ్యాల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Kayadu Lohar : అప్పుడు దేఖలేదు.. ఇప్పుడేమో క్రష్ అంటున్నారు!
కీయర అద్వాని హీరోయిన్‌గా, నయనతార, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీని ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. టాక్సిక్‌ను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో ఒకేసారి ఈ రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీగా నిలువనుంది టాక్సిక్. యశ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.