Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’

Toxic

Toxic

మాస్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సాధారణంగా సొంత రాష్ట్రంలో ఆరంభంలోనే భారీ వసూళ్లు రావడం సాధారణం. టాక్ ఎలా ఉన్నప్పటికీ బిగ్ బడ్జెట్, విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్, భారీ ఓపెనింగ్స్‌తో ఈజీగా రికార్డు వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ చిత్రానికి కర్ణాటకలో దానికి భిన్నమైన పరిస్థితులు ఎదురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సొంత హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ చిత్రం కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో కూడా చేరలేకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. యష్‌కున్న క్రేజ్‌ను బట్టి కర్ణాటక బాక్సాఫీస్ వద్ద ఈ మార్క్‌ను చాలా తేలికగా చేరుకుంటుందని అందరూ భావించారు. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన టాక్సిక్ రెండవ రోజు నుండి ఒక్కసారిగా డ్రాప్ అయింది. అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో థియేట్రికల్ రన్‌లో వంద కోట్ల మార్జిన్‌ను అందుకోవడంలో విఫలమైంది. అయితే కన్నడ మాతృభూమిలో ఆశించిన స్థాయి వసూళ్లు రానప్పటికీ, ఉత్తరాదిలో హిందీ బెల్ట్ లో మాత్రం ‘టాక్సిక్’ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే హిందీ మార్కెట్‌లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కడం విశేషం. బాలీవుడ్ బెల్ట్‌లో వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత ఊరటనిస్తున్నాయి. తెలుగులోను ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్ తెచుకున్నప్పటికీ రెండవ రోజు నుండి షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి చూసింది. దాంతో తెలుగులోను ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి బయ్యర్స్ కి  నష్టాలు తెచ్చింది.