Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలతో రాకింగ్ స్టార్ యశ్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో యశ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ‘కేజీఎఫ్’ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నెక్ట్స్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఆయన జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 22న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్ తన ‘కేజీఎఫ్ 2’ గ్రాండ్ సక్సెస్ తర్వాత హైదరాబాద్‌కు ఎందుకు రాలేకపోయానో వివరించారు. ముందుగా ‘కేజీఎఫ్ 2’ కు తెలుగు ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
‘కేజీఎఫ్ 2’ భారీ విజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాల్సి ఉందని, అయితే తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని యశ్ వెల్లడించారు. ‘టాక్సిక్’ విడుదల తర్వాత తప్పకుండా హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతానని పేర్కొన్నారు. ఇకపోతే ‘టాక్సిక్’ కథ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ 1940 నుంచి 1970 మధ్య కాలంలో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ కార్టెల్, అండర్‌వరల్డ్, అధికారం, నమ్మకద్రోహం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో యశ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ఈ చిత్రంలో ఆయన ‘రాయా’, ‘టికెట్’ అనే పాత్రల్లో డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు వెల్లడైంది. ఈ చిత్రంలో గీతూ మోహన్‌దాస్ యశ్‌ను ఇప్పటి వరకు చూడని సరికొత్త అవతార్‌లో చూపించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!