Site icon NTV Telugu

ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లాడి షాకిచ్చిన హీరోయిన్

Yami Gautam ties knot with Writer and Director Aditya Dhar

ప్రముఖ డైరెక్టర్ ను పెళ్ళాడి తన అభిమానులకు షాకిచ్చింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్”తో భారీ హిట్ ను అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామి గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. వీరి పెళ్లి వేడుక కరోనా కారణంగా అత్యంత్య సన్నిహితులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే… ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన “ఉరి” చిత్రంలో యామి గౌతమ్ కూడా నటించింది. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రణయంగా మారడంతో ఆదిత్య-యామి తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు యామి-ఆదిత్య పెళ్లి పిక్స్ చూసిన ప్రముఖులు, వారి అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యామి గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఒక ఫేస్ క్రీం యాడ్ తోనే మంచి క్రేజ్ వచ్చింది.

Exit mobile version