NTV Telugu Site icon

Prasanth Neel : ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

Prasanth (2)

Prasanth (2)

ప్రముఖ ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో తీసిన సినిమాలు ఒకలెక్క కేజీఎఫ్ తర్వాత అతని పేరు ఎక్కడికో వెళ్లింది.. భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 భారీ కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా తర్వాత సలార్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులను తెరకేక్కిస్తున్నాడు..

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ అసలు పేరు ఏంటో చాలా మందికి తెలియదు.. ఏంటీ ప్రశాంత్ నీల్ కు మరో పేరు ఉందా అనే డౌట్ వస్తుంది కదా..అతని బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం.. ఈయన తెలుగోడే.. రాయలసీమ బిడ్డే.. ఈయన తండ్రి దివంగత సుభాష్‌.. చాలా ఏళ్ల క్రితం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠాపురంకు సుభాష్‌, ప్రశాంత్ నీల్ వస్తుండేవారు. నీలకంఠాపురం అనే తమ ఊరి పేరునే ఇంటి పేరుగా వారు పెట్టుకున్నారు..

సొంతూరి మీద మమకారంతో అతను నీల్ అని పెట్టుకున్నాడని సమాచారం.. అలాగే మాజీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డికి బంధువు అవుతాడట.. ఇక ప్రశాంత్ నీల్ గ్రామానికి చాలా సార్లు వచ్చేవారని, కానీ చాలా సింపుల్‌గా ఉంటారని గ్రామస్థులు చెబుతుంటారు.. అంతేకాదు గతంలో ఆ ఊర్లో కంటి ఆసుపత్రిని పెట్టడానికి భారీ సాయాన్ని అందించినట్లు తెలుస్తుంది.. ఇక సినిమాలను చూస్తే.. సలార్ పార్ట్ 2 కూడా కన్ఫామ్ చేశారు. దీని షూటింగ్ త్వరలో స్టార్టయ్యే అవకాశం ఉంది.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చెయ్యబోతున్నాడు..