Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా తన ఓపెన్ కామెంట్స్, బోల్డ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. అయితే నెటిజన్లు, సినీ ప్రియులు ఆయనను ముద్దుగా ‘చింటూ‘ అని పిలుస్తుంటారు. అసలు చింటూ అంటే ఏంటి ఆపేరు ఎందుకు వచ్చింది అనే దానిపై నాగవంశీ స్పందించారు.
గత రాత్రి చెన్నైలో జరిగిన విశ్వనాధ్ అండ్ సన్స్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఈవెంట్ హోస్ట్ చేస్తున్న యాంకర్ మీకు చింటూ అనే పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు బదులిస్తూ ‘తమిళ ఇండస్ట్రీలో కూడా చింటూ వినిపిస్తోందా.. నేను సోషల్ మీడియాలో కొంచెం రెబల్‌గా ఉంటాను. నా అభిప్రాయాలను నేరుగా, బోల్డ్‌గా చెబుతుంటాను. అందుకే అన్ని హీరోల అభిమానులు నన్ను ప్రేమతో ముద్దుగా ‘చింటూ’ అని పిలుస్తుంటారు. చింటూ అంటే ఒక మంచి ఫ్రెండ్ లేదా అన్న అని అర్థం. ట్రోల్స్‌ని లేదా కామెంట్స్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకునే నాగవంశీ నైజంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా, తన్ను నెటిజన్లు ఒక సొంత మనిషిలా భావించి ఆ పేరుతో పిలవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని’ అన్నారు. నాగవంశీ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వనాధ్ అండ్ సన్స్. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read
- Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
- Viswanath & Sons: 'అల వైకుంఠపురములో' రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
తాజావార్తలు
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!