Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Nagavamsi

Nagavamsi

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా తన ఓపెన్ కామెంట్స్, బోల్డ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. అయితే నెటిజన్లు, సినీ ప్రియులు ఆయనను ముద్దుగా చింటూ అని పిలుస్తుంటారు. అసలు చింటూ అంటే ఏంటి ఆపేరు ఎందుకు వచ్చింది అనే దానిపై నాగవంశీ స్పందించారు.

గత రాత్రి చెన్నైలో జరిగిన విశ్వనాధ్ అండ్ సన్స్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఈవెంట్ హోస్ట్ చేస్తున్న యాంకర్ మీకు చింటూ అనే పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు బదులిస్తూ ‘తమిళ ఇండస్ట్రీలో కూడా చింటూ వినిపిస్తోందా.. నేను సోషల్ మీడియాలో కొంచెం రెబల్‌గా ఉంటాను. నా అభిప్రాయాలను నేరుగా, బోల్డ్‌గా చెబుతుంటాను. అందుకే అన్ని హీరోల అభిమానులు నన్ను ప్రేమతో ముద్దుగా ‘చింటూ’ అని పిలుస్తుంటారు. చింటూ అంటే ఒక మంచి ఫ్రెండ్ లేదా అన్న అని అర్థం. ట్రోల్స్‌ని లేదా కామెంట్స్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకునే నాగవంశీ నైజంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా, తన్ను నెటిజన్లు ఒక సొంత మనిషిలా భావించి ఆ పేరుతో పిలవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని’ అన్నారు. నాగవంశీ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వనాధ్ అండ్ సన్స్. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.