బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద తాజాగా జరిగిన సంఘటన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాంద్రాలోని ఆయన నివాసానికి ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు బస్సులు, వ్యాన్లలో చేరడంతో చుట్టుపక్కల గమనించినవారంతా అవాక్కయ్యారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత మంది పోలీసు అధికారులు ఒక ప్రముఖ నటుడి ఇంటికి అకస్మాత్తుగా రావడం వెనుక కారణం ఏమై ఉండవచ్చు? అనే దానిపై నెటిజన్లలో కాస్త గందరగోళం మొదలైంది.
Also Read : Peddi : ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ పై లెటేస్ట్ బజ్ ..
అయితే ఈ విషయంపై స్పష్టత పొందేందుకు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఆమిర్ ఖాన్ టీమ్‌ని సంప్రదించగా.. “మాకూ ఇప్పటికీ పూర్తైన సమాచారం లేదు. ఆరా తీస్తున్నాం” అని వారు స్పందించారు. మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆమిర్‌ఖాన్‌ను కలవడం కోసమే అధికారులు వచ్చారని, ఇది కేవలం ఫార్మల్ విజిట్ మాత్రమేనని చెబుతున్నాయి. అయితే ఇది ఫార్మల్ మీటింగా.. లేదా సెక్యూరిటీ పరంగా ముందస్తు ఏర్పాట్లు కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన ఈ హడావిడికి పూర్తి స్థాయిలో నిజమేంటో తెలిసే వరకు వేచి చూడాల్సిందే..!
