Costume Krishna: ఆరెండు సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ సినిమాలకు దూరమయ్యేలా చేశాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Costume Krishna: సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ అనారోగ్యంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. నటుడిగా తొలి సినిమా భారత్ బంద్ సినిమాలో నటుడిగా పరిచమైన ఆయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించడమే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రలతో ప్రజలను మెప్పించారు. నిర్మాతగా 8 సినిమాలు నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
సినిమా ఇండస్ట్రీకి దూరం?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటుడు, కాస్ట్యూమ్స్ కృష్ణ అనతికాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. రామానాయుడు సంస్థలో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. లెక్కలేనన్ని సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి కథానాయికలకు కాస్ట్యూమ్స్ అందించి సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా.. ఆయన ఘట్టమనేని కృష్ణ హీరోగా అశ్వద్దామ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో పెళ్లాం చెప్తే వినాలి, మా ఊరు మారాడు, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో జేబులో కాసుల వర్షం కురిసింది.
ఆరెండు సంతాకాలు?
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో కాస్ట్యూమ్స్ కృష్ణకు పెళ్లిపందిరి సినిమా రూపంలో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లిపందిరి సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదని, సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుందని భావించిన కృష్ణ, సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు భయపడి ఈ విషయాన్ని చిత్ర హీరో జగపతిబాబుకు చెప్పాడట. కానీ పబ్లిసిటీ అవసరం లేదు సార్ అని కృష్ణ అన్నారు. కానీ కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం 2 లక్షలు అప్పు ఇస్తాం.. సంతకం చేస్తే చాలు అంటూ ముందుకు వచ్చారు. జగపతిబాబు కూడా ఈ రుణానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో.. ఆయనను నమ్మిన కృష్ణ రెండు సంతకాలు పెట్టారు.
పెద్దగా చదువుకోని కృష్ణకు తమిళం, తెలుగు తప్ప వేరే భాష తెలియదు. దీంతో ఆయన సంతకం పెట్టిన మొదటి కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణకి బయ్యర్లు 2 లక్షలు అప్పు ఇచ్చినట్టు” ఉండగా, ఇక..మరో కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణ దగ్గర నుంచి పెళ్లిపందిరి సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ బయ్యర్లు కొన్నట్లు ఉంది. అయితే..ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణ తనని నమ్మకంలో మోసం చేశారని బాధపడ్డారట. అంతేకాకుండా.. సినిమాలపై విరక్తి పుట్టి చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. ఇక అప్పడే ఆయన చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన ఇవాళ చెన్నైలోనే తన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
IPL 2023 : ఉప్పల్ లో హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!