Canes Film Festival : ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఫ్రాన్స్ లో మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు జరగనుంది.ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.అయితే ఈ సారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపిక అయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ది షేమ్ లెస్” నటి అనసూయ సేన్‌గుప్తా టాప్ యాక్టింగ్ అవార్డును గెలుచుకుంది.అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె అందుకుంది.
Read Also :Amma Rajasekhar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అమ్మ రాజశేఖర్ తనయుడు..
బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బోజనోవ్ తెరకెక్కించిన ది షేమ్‌లెస్‌లో తన చురుకైన పాత్రకు గాను ఈ అవార్డును గెలుచుకుంది, ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయురాలుగా అనసూయ సేన్గుప్తా నిలిచింది.ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలో ఒక పోలీసును చంపిన తర్వాత, రేణుక అనే యువతి సెక్స్ వర్కర్లతో కలిసిపోతుంది. అక్కడ ఆమె 17 ఏళ్ల దేవికతో ప్రేమను కొనసాగిస్తుంది. సంప్రదాయాలన్నిటిని ఎదిరిస్తూ తమ ప్రేమను కొనసాగించేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారనే విషయాన్నిఈ సినిమాలో చూపించారు. ఔరోషిఖా డే, ఒమారా, అనసూయ సేన్గుప్తా మరియు మితా వశిష్ట్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.