Site icon NTV Telugu

అమితాబ్ ‘బిస్కెట్’ ఆఫర్ ని అడ్డంగా తిరస్కరించిన దర్శకుడు!

ప్రతీ సూపర్ స్టార్ వెనుక ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటాడు! ఇది నిజం! అమితాబ్ బచ్చన్ కి కూడా చాలా మంది దర్శకులు సూపర్ హిట్ మూవీస్ అందించారు. అయితే, ఆయన సూపర్ స్టార్ అవ్వటంలో ప్రధాన పాత్ర పోషించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆయన సుదీర్ఘ కెరీర్ లో అవి మైల్ స్టోన్స్ గా నిలిచిపోతాయి. ఇక ఆ మైలు రాళ్ల లాంటి చిత్రాల్లో… చాలా వరకూ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ అందించటం విశేషం. ‘కూలీ, మర్ద్, తూఫాన్, నసీబ్, అమర్ అక్బర్ ఆంథొని’ లాంటివి వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్స్ లో కొన్ని మాత్రమే!

తనని సూపర్ స్టార్ గా మలచటంలో ఎంతో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ దేశాయ్ తో బిగ్ బీకి ఆత్మీయ అనుబంధం ఉండేది. వారిద్దరూ చాలా సరదాగా ఉంటూ, గొప్ప స్నేహితులుగా మెలిగేవారు. అయితే, అమితాబ్, మన్మోహన్ దేశాయ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ లో ఉండగా మన్మోహన్ ను బచ్చన్ సాబ్ ‘బిస్కెట్ తినమని’ అడుగుతాడు. ‘బిస్కెట్ విస్కెట్ నాకేం వద్ద’ని దేశాయ్ చెబుతాడు. అయితే, బిగ్ బీ ‘ఈ బిస్కెట్ తింటే సినిమా హిట్ అవుతుందని ఇక్కడ రాసి ఉంది’ అంటూ సరదాగా కామెంట్ చేస్తాడు. దానికి లెజెండ్రీ డైరెక్టర్ ‘అయితే నువ్వే తిను! నాకంటే నీకే ఎక్కువగా హిట్ మూవీ అవసరం ఇప్పుడు’ అంటాడు!

అలనాటి అమితాబ్, మన్మోహన్ దేశాయ్ వీడియోని చూసి ఇప్పుడు నెటిజన్స్ మురిసిపోతున్నారు. వారిద్దరి మధ్యా ఉన్న ప్రొఫెషనల్ రిలేషన్ కు మించిన పర్సనల్ బాండింగ్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు!

View this post on Instagram

A post shared by Sudarshan (@notwhyral)

Exit mobile version