NTV Telugu Site icon

Akshay Kumar : “కన్నప్ప” మూవీ కోసం అక్షయ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Whatsapp Image 2024 05 06 At 9.20.27 Am

Whatsapp Image 2024 05 06 At 9.20.27 Am

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప”. ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయి నటీ నటులు కనిపించనున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ లాల్ ,శరత్ కుమార్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి షూట్ కూడా పూర్తి చేసుకున్నారు.

కన్నప్ప లో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. మొదట శివుడి పాత్రకు రెబల్ స్టార్ ప్రభాస్ ను అనుకున్నారని సమాచారం. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి అక్షయ్ ను తీసుకున్నారు. అలాగే ప్రభాస్ ఈ సినిమా లో కీలక ఓపాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో అక్షయ్ కు ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం .రీసెంట్ గా ఈ సినిమాలో మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు .