NTV Telugu Site icon

Singer Kalpana : అసలు సింగర్ కల్పనకి ఏమైంది?

Kalpana

Kalpana

సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం కేసులో విచారణ మొదలు పెట్టారు పోలీసులు. గత రెండు రోజులుగా బయటకు వెళ్ళాను అని సింగర్ భర్త చెబుతున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్నం చేసిన సింగర్ కల్పన రెండు రోజులగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కల్పన భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్తను తీసుకొని ఇంటికి వెళ్లిన పోలీసులు, కల్పన ఇంట్లో మరోసారి తనిఖీలు చేస్తున్నారు.

వర్టేక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా సింగర్ కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ నాకు కాల్ చేసాడని అన్నారు. సాయంత్రం 4:30 గంటలకి కాల్ రిసీవ్ చేశా, నాకు హెల్ప్ కావాలని ఫోన్ లో చెప్పాడు. నేను అపార్ట్ మెంట్ సుపర్ వైజర్ నెంబర్ ఇచ్చాను. భర్త కల్పనకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సీసీ కెమెరాల్లో కల్పన భర్త పరిశీలించి మాకు కాల్ చేశాడు, అప్పటికే అపస్మాక స్థితిలో కల్పన ఉందని ఆయన అన్నారు. వెంటనే మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము, పోలీసులు డోర్లు బ్రేక్ చేసి అపస్మానిక స్థితిలో ఉన్న కల్పనని ప్రైవేట్ హాస్పిటల్స్ షిఫ్ట్ చేశారు అని అన్నారు.

గత రెండు రోజులుగా భర్త ఇంట్లో లేరని, ఐదు సంవత్సరాలుగా వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నివాసం ఉంటున్నారఇన్ ఆయన అన్నారు. కల్పన, భర్త మంచిగా ఉండేవారు, మాతో మాట్లాడే వారు. ఇద్దరు మధ్య ఏమైనా ఎలాంటి విభేదాలు ఉన్నాయో మాకు తెలియదువర్టిక్స్ ప్రివిలేజ్ విల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్న కల్పన అటెండ్ అయ్యేవారని ఆయన అన్నారు. మరోపక్క నిజాంపేటలోని హోలిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హాస్పిటల్ వెళ్లారు సింగర్ సునీత.