NTV Telugu Site icon

Ghaati: అనుష్క ఘాటీ’కి ఏమైంది?

Anushka

Anushka

బాహుబలి 2 తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. మిసెస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ .. రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నీల్ ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీతో పాటు మలయాళంలో కథనార్ మూవీతో తెరంగేట్రం ఇస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. రీసెంట్లీ ఘాటీ గ్లింప్ప్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్సివ్ లుక్కుతో మెస్మరైజ్ చేసింది అనుష్క. ఏప్రిల్ 18న ఘాటీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇంత వరకు ఓకే కానీ.. ఇప్పుడే అనుమానం మొదలైంది. గట్టిగా సినిమా విడుదలకు 40 రోజులు కూడా లేదు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రమోషన్ల స్టార్ట్ చేయలేదు యూనిట్. అలాగే టీజర్, ట్రైలర్ ఊసే లేదు. జస్ట్ గ్లింప్స్ మాత్రమే వదిలింది. ఇదిగో బ్యాక్ టు బ్యాక్ టీజర్, ట్రైలర్స్ అంటూ బజ్ వచ్చింది కానీ ఆ ఊసే పట్టనట్లుంది మేకర్స్‌కు. దీంతో అనుకున్న తేదీకి సినిమా రావడం పక్కాయేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Trivikram: అల్లు అర్జున్కు షాక్ ఇస్తున్న త్రివిక్రమ్.. ఆ హీరోతో సినిమా..?

ఘాటీతో పాటు మలయాళంలో కథనార్ ద వైల్డ్ సోర్సెరర్ చేస్తోంది. వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోం ఫేం రోజిన్ థామస్ ఈ సినిమాకు దర్శకుడు. జయసూర్య టైటిల్ రోల్ పోషిస్తుండగా.. 13 సంవత్సరాల తర్వాత ప్రభుదేవా ఈ సినిమాతో మరోసారి మాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న కథనార్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 2024లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా..2025కి జంపయ్యింది. ప్రజెంట్ డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్టయ్యాయి. మరీ రిలీజ్ ఎప్పుడో ఎనౌన్స్ చేయలేదు. ఏడాదికిపైగా అనుష్కను మిస్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఆమె రాక కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే మూవీల రిలీజ్ విషయంలో స్వీటీకొక క్లారిటీ ఉన్నట్లు ఉంది. కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడితే లాభం ఏముంది..? చెప్పండి..?