Site icon NTV Telugu

“రాపో19” కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్…!

Welcoming Rockstar DSP Onboard for RAPO19

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుసామితో చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన విశాల్ ‘పందెంకోడి’ చిత్రానికి దర్శకత్వం వహించగా… ఆ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో రామ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం తెలిసిందే.

Exit mobile version