Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warrant on ZEE5: ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కుదిపేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో మేకర్స్ పోలీస్ వ్యవస్థలోని క్రూరమైన వాస్తవాలను అత్యంత రియలిస్టిక్‌గా చూపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ దక్షిణాది భాషల్లో భారీ ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఐఎమ్‌డీబీలో 8కి పైగా రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్, ఓటీటీలో కచ్చితంగా మిస్ కాకూడని ఇంటెన్స్ పోలీస్ డ్రామాల్లో ఒకటిగా నిలుస్తోందని చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ సిరీస్ పేరేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్
ZEE5 లో మే 22 న ‘వారెంట్’ పేరుతో విడుదలైంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ వెబ్ సిరీస్‌లో దర్శకుడు చాలా సహజంగా తెరపై చూపించాడు. ఒక చిన్న పట్టణంలో కానిస్టేబుల్‌గా పనిచేసే కోట్టై కరుప్పుసామి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అమాయకత్వం, ఓర్పు కలిగిన అతను ప్రతిరోజూ తన పై అధికారుల చేత అవమానాలు, వేధింపులు ఎదుర్కొంటూ బతుకుతుంటాడు. కానీ ఎంత నిశ్శబ్దంగా కనిపించే మనిషిలోనైనా ఒక దశ దాటిన తర్వాత కోపం అనేది ఎంత భయంకరంగా వస్తుందో ఈ సిరీస్‌లో చూపించింది. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ZEE5 లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సిరీస్ ‘విలంగు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘వారెంట్’కు ప్రశాంత్ పాండియరాజ్ క్రియేటర్‌గా వ్యవహరించగా, విగ్నేష్ నటరాజన్ దర్శకత్వం వహించాడు. కరుప్పుసామి పాత్రలో ప్రశాంత్ పాండియరాజ్ అద్భుతమైన నటన కనబరిచాడు. బాలాజీ శక్తివేల్, కాళీ వెంకట్, అరుళ్ దాస్, నమ్రిత వంటి నటులు వారివారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
‘వారెంట్’ సిరీస్ కథ ఏమిటంటే ?
పోలీస్ స్టేషన్లో కరుప్పుసామి అనే కానిస్టేబుల్ కొంచెం మెతక మనిషి. ఓర్పు కూడా ఎక్కువే. అయితే అతన్ని పై అధికారులు చాలా తీవ్రంగా అవహేళన చేస్తుంటారు. అన్ని ఓపికగా భరిస్తున్న కరుప్పుసామి జీవితంలో ఒక లాకప్ డెత్ జరుగుతుంది. ఇది కరుప్పు స్వామి జీవితంతో పాటు మొత్తం పోలీస్ వ్యవస్థను కుదిపేస్తుంది. అప్పటివరకు తనలోనే దాచుకున్న పగ, ఆవేదన కరుప్పుసామిలో నుంచి బయటకు వస్తాయి. దీంతో పోలీస్ స్టేషన్లో సంవత్సరాలుగా మూలనపడ్డ పాత కేసులను అతను తిరిగి తెరపైకి తీసుకొస్తాడు. ఒక్కో కేసును విచారించే తీరు, నేరస్థుల పట్ల అతను ప్రదర్శించే క్రూరత్వం చూస్తే చూసే ప్రేక్షకులకే భయం వేస్తుంది. కరుప్పుసామి ఎలా కేసులను డీల్ చేశాడు ? అతన్ని చూసి పై అధికారులు కూడా ఎందుకు భయపడ్డారు ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలతో ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠంగా నడుస్తుంది.
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!