RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ ను వార్ 2 కోసం అగ్రిమెంట్స్ చేసేసారు.
Also Read : Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే
ఇక ఇప్పుడు USA లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తుంది. ఆగస్టు 13న రజనీకాంత్ కూలీ కూడా ఉండండంతో పోటీ ఉంటుందని భావించారు కానీ వార్ 2 పూర్తిగా తన స్టామినా ఏంటో చూపిస్తోంది. నార్త్ అమెరికాలోని సినేమార్క్, రీగల్ సినిమాస్ వంటి చైన్ థియేటర్స్ ను వార్2 కోసం లాక్ చేసారు. సాధారణంగా తెలుగు డబ్బింగ్ హిందీ సినిమాలకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అనేవి ప్రదర్శించడం జరగదు. కానీ మొట్ట మొదటిసారి వార్ 2 తో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు రెడీ చేస్తున్నారు. కేవలం ప్రీమియర్స్ దేవర ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ 3.8 M ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వార్ 2 రిలీజ్ ను సెలెబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా సరే USA ప్రీమియర్స్ తో రికార్డుల వేట మొదలు పెట్టడం మాత్రం గ్యారెంటీ.
