ఇన్‌స్టా లోనూ బ్యాన్… కంగనా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె కథను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను షేర్ చేసింది. అయితే ప్రతిరోజూ దాదాపు 4000 మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనాను చిన్న ఫ్లూ అంటూ కంగనా తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ ఇన్స్టాగ్రామ్ ఆమె పోస్ట్ ను తొలగించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ‘నేను కోవిడ్ ను నాశనం చేస్తానని పోస్ట్ చేయడంతో కొందరు హర్ట్ అయ్యారట. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు, కమ్యూనిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్ లో విన్నాను. కానీ ఇన్‌స్టాలో కరొనకు ఫ్యాన్ క్లబ్ ఉంది. ఇన్‌స్టాకు వచ్చి కొన్ని రోజులే అవుతోంది. కానీ ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని అనుకోవడం లేదు’ అంటూ పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తనను బ్యాన్ చేయడం గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అది తనకు గౌరవ బ్యాడ్జ్ అవుతుందని పేర్కొంటూ కంగనా సోమవారం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read
- ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- Tags
- Kangana Ranaut
తాజావార్తలు
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!