Vrushakarma Trailer: నాగ చైతన్య కీ కామెంట్స్.. అందరి చూపు ‘వృషకర్మ’ ట్రైలర్‌పైనే!

Vrushakarma Trailer Date Time

Vrushakarma Trailer Date Time

Vrushakarma Trailer: అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’తో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో చైకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచింది.

వృషకర్మ అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు అత్యంత కీలకమైన ట్రైలర్‌ ఈరోజు విడుదల కానుంది. నెల్లూరులోని నార్త్ రాజుపాలెంలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలెట్టిన హీరోహీరోయిన్స్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరిలు ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవన్నారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ మిస్టికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘ఇలాంటి మూమెంట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. కార్తీక్ అన్నట్లు.. వృషకర్మ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది. క్లైమాక్స్ ఇండియన్ సినిమా అభిమానులకు ఓ బెంచ్ మార్క్ అవుతుంది’ అని నాగ చైతన్య చెప్పారు. చై కీ కామెంట్స్, మిస్టికల్ థ్రిల్లర్ కాబట్టి ట్రైలర్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విడుదల కానున్న ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.