Site icon NTV Telugu

Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?

Viswambhara News

Viswambhara News

Viswambhara targetting Sankranthi 2025: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా అనౌన్స్ చేయబడిన ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయింది కానీ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్న ఒక షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు వెళ్లి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి నుంచి రిలీజ్ డేట్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి మీద కన్నేసినట్లు చెబుతున్నారు.

Pushpa’s Rule: మరో 200 రోజుల్లో పుష్ప గాడి రూలింగ్

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల టెన్షన్ వ్యవహారం మీద ముందుగానే కొంత అవగాహన రావడంతో వచ్చే ఏడాది రిలీజ్ డేట్ ని మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సినిమాని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మేకర్లు. అందుకు తగ్గట్లుగానే ప్లానింగ్ అంతా సిద్ధం చేస్తున్నారు.. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన వారికి మొదటి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా అధికారిక ప్రకటనలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో క్లారిటీ రానుంది.

Exit mobile version