NTV Telugu Site icon

Vishwak Sen : ఎప్పటికైనా ఆయనంత గొప్ప నటుడిని కావాలి..

Whatsapp Image 2024 04 28 At 7.23.18 Am

Whatsapp Image 2024 04 28 At 7.23.18 Am

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ సినిమా గత సంవత్సరం నుంచి పలుసార్లు రిలీజ్ వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.తాజాగా ఏప్రిల్ 27 న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి విశ్వక్ ఆసక్తికర విషయాలు తెలియజేసారు.

ఎన్టీఆర్ గారు స్టార్ కంటే ముందు తనకు గొప్ప నటుడు అని విశ్వక్‍సేన్ అన్నారు. ఎన్టీఆర్ అంత గొప్ప నటుడిని కావాలని ఉందని విశ్వక్ తన మనసులో మాట బయట పెట్టారు .తన దృష్టిలో దేశంలో అందరి కంటే గొప్ప నటుడు ఎన్టీఆర్ అని విశ్వక్ చెప్పారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తాను చేసిన లంక రత్నం రోల్ తన డ్రీమ్ రోల్ అని విశ్వక్‍సేన్ చెప్పారు.తనకు వచ్చిన ‘మాస్ కా దాస్ ‘ అనే ట్యాగ్‍కు ఈ మూవీ ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని విశ్వక్ అన్నారు. అలాగే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందని నిర్మాత నాగవంశీ తెలిపారు . తాజాగా రిలీజ్ అయిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది . మాస్ గెటప్ లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు .ఈ మూవీ రిలీజ్ అయ్యాక అద్భుత విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వున్నారు .

Show comments