Site icon NTV Telugu

Vishwambhara : మెగా ఫాన్స్ కి దసరా బొనాంజా.. గెట్ రెడీ

Vishwambhara Teaser

Vishwambhara Teaser

Vishwambhara Teaser to Release tomorrow: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందుకు వచ్చారు. అదేమంటే ఈ సినిమా టీజర్ ను రేపు దసరా సందర్భంగా ఏర్పాటు చేసే ఒక ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. బాలానగర్ విమల్ థియేటర్ లో ఏర్పాటు చేయనున్న ఈవెంట్ లో దాన్ని లాంచ్ చేయనున్నారు. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున ‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ యూత్ ఫుల్ అండ్ డైనమిక్‌గా కనిపించారు.

Devara: దేవర మిడ్ నైట్ షోస్.. డివైడ్ టాక్ పై నాగవంశీ కీలక వ్యాఖ్యలు

విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు, ఇది టాప్-నాచ్ VFX, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో విజువల్ వండర్‌గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది, ఈ సినిమాలో ప్రముఖ తారాగణం, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.

Exit mobile version