Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!

Trisha As Avani Vishwambhara

Trisha As Avani Vishwambhara

నటి త్రిష పుట్టినరోజు (మే 4) సందర్భంగా ‘విశ్వంభర’ చిత్ర బృందం ఆమెకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ త్రిషకు విషెస్ చెబుతూ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర పేరును కూడా వెల్లడించింది.

ఈ సినిమాలో త్రిష ‘అవని’ అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమె నటన ఎంతో హుందాగా, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ‘బియాండ్ ది యూనివర్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మెగా మాస్ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మళ్ళీ వెండితెరపై సందడి చేయనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా విడుదల చేసిన బర్త్ డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.